Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికీ కోమాలోనే ఉన్నారు.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం: ఆర్మీ ఆసుపత్రి

Pranab Mukherjee continues to be in deep coma and on ventilator support
  • న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న ప్రణబ్
  • ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్
  • చికిత్స అందిస్తున్న ఆర్మీ ఆసుపత్రి
  • గుండె సంబంధిత అవయవాల పనితీరు బాగానే ఉందని వెల్లడి
న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి తాజా బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది.

ఆయన గుండెతో పాటు కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి తన బులెటిన్ లో వివరించింది. కాగా, ప్రణబ్‌ ముఖర్జీకి కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఇటీవల సర్జరీ చేశారు. మరోపక్క, ఆయన కరోనాతో కూడా బాధపడుతున్నారు.
Pranab Mukherjee
India
Corona Virus

More Telugu News