JEE: షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ పరీక్షలు: క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- జేఈఈ పరీక్షలకు 7.5 లక్షల మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు
- నీట్ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు
- పరీక్షా కేంద్రాలను కూడా పెంచాం
నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. జేఈఈ పరీక్షకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గాను... ఇప్పటికే 7.5 లక్షల మంది తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు.
నీట్ పరీక్షకు సంబంధించి మొత్తం 15.97 లక్షల అడ్మిట్ కార్డులకు గాను... 10 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సుముఖంగా ఉన్నారనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా నేపథ్యంలో జేఈఈ పరీక్షా కేంద్రాలను 570 నుంచి 660కి పెంచామని... అదేవిధంగా నీట్ కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచామని తెలిపారు.