Bay of Bengal: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Heay rains forecast today in Telangana

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • రాష్ట్రంలోని 14 జిల్లాలకు భారీ వర్ష సూచన
  • ఉభయ వరంగల్ జిల్లాల్లో నిన్న 12 సెం.మీ. వర్షపాతం నమోదు

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండడంతోపాటు, రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వివరించారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News