Rhea Chakraborty: హీరోయిన్ రియాకు సీబీఐ సంధించిన 10 ప్రశ్నలు ఇవే!
- సుశాంత్ కేసులో విచారణను ముమ్మరం చేసిన సీబీఐ
- రియాను, ఆమె సోదరుడిని వేర్వేరుగా ప్రశ్నించిన అధికారులు
- ఇద్దరి స్టేట్మెంట్లను పరిశీలించనున్న సీబీఐ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె స్టేట్మెంట్లను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. రియా సోదరుడిని కూడా సీబీఐ వేరుగా ప్రశ్నించింది. వీరిద్దరి సమాధానాలను సీబీఐ అధికారులు పరిశీలించనున్నారు. 28 ఏళ్ల రియాను అడిగిన ప్రశ్నల్లో కీలకమైన 10 ప్రశ్నలు ఇవే.
- సుశాంత్ మరణం గురించి మీకు ఎవరు తెలిపారు? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?
- మరణం గురించి తెలిసిన వెంటనే మీరు బాంద్రాలోని అతని నివాసానికి వెళ్లారా? ఒకవేళ వెళ్లకపోతే... అతని డెడ్ బాడీని ఎప్పుడు, ఎక్కడ చూశారు?
- జూన్ 8వ తేదీన (సుశాంత్ మరణానికి 6 రోజుల ముందు) సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయారు?
- ఏదైనా గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయారా?
- సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత... జూన్ 9వ తేదీ నుంచి 14 మధ్య అతనితో ఎప్పుడైనా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడి ఉంటే... దేని గురించి మాట్లాడారు?
- అదే సమయంలో మీతో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించాడా? అతని కాల్స్ ను, మెస్సేజ్ లను మీరు పట్టించుకోలేదా? ఒకవేళ అతని కాల్స్ ను మీరు పట్టించుకోని పరిస్థితుల్లో... అతని నంబర్ ను ఎందుకు బ్లాక్ చేశారు?
- మీ కుటుంబ సభ్యులను కలిసేందుకు సుశాంత్ ప్రయత్నించాడా?
- సుశాంత్ కు ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి? ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడా? డాక్టర్లు, సైకియాట్రిస్టులు, మెడికేషన్ వివరాల గురించి చెప్పండి.
- సుశాంత్ కుటుంబంతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- ఈ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని మీరు ఎందుకు కోరారు? ఇందులో నేరపూరితమైన చర్య ఏదైనా వుందని భావించారా?