Nagarjuna: ఇక చచ్చిపోయినా పర్లేదు సార్... నాగార్జున ఫోన్ కాల్ తో ఉబ్బితబ్బిబ్బయిన మహిళా అభిమాని... వీడియో ఇదిగో!

Nagarjuna called a lady fan who suffers with brain tumor
  • బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న నెల్లూరు వాసి లక్ష్మి
  • నాగార్జున అంటే లక్ష్మికి వీరాభిమానం
  • కరోనా కారణంగా స్వయంగా వెళ్లలేకపోయిన నాగ్
నెల్లూరు పట్టణానికి చెందిన లక్ష్మి హీరో నాగార్జునకు వీరాభిమాని. ఆమె గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో పోరాడుతోంది. ఇంతకుముందు ఆమెకు పలు విడతలుగా శస్త్రచికిత్సలు జరిగాయి. మరికొన్ని నెలల్లో లక్ష్మికి వైద్యులు చివరి శస్త్రచికిత్స చేయనున్నారు. ఆమె పరిస్థితి నాగార్జునకు తెలియడంతో ఆయన ఎంతో కదిలిపోయారు. వెంటనే లక్ష్మిని కలిసి కుంగిపోవద్దని చెప్పి, ఆమెను ఆనందంలో ముంచెత్తాలని భావించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తీవ్రస్థాయిలో ఉండడంతో నెల్లూరు వెళ్లలేకపోయారు.

అయితే, లక్ష్మి ఊహించని రీతిలో నాగ్ ఫోన్ కాల్ ద్వారా సర్ ప్రైజ్ చేశారు. ఇవాళ లక్ష్మికి ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. తన అభిమాన హీరో జూమ్ వీడియో కాల్ చేయడం లక్ష్మిని సంతోష సాగరంలో ముంచెత్తింది. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని మామూలు మనిషివి అవుతావు అంటూ నాగ్ ఆమెలో ఆత్మస్థైర్యం కలిగించేలా మాట్లాడారు. లక్ష్మి మాట్లాడుతూ, నాగ్ తనతో మాట్లాడిన తర్వాత ఇక తాను ఏమైపోయినా ఫర్వాలేదని, ఈ జన్మకు ఇది చాలని పేర్కొంది.

Nagarjuna
Lakshmi
Fan
Brain Tumor
Zoom Call
Nellore

More Telugu News