Corona Virus: చైనాలో క్రమంగా మాయమవుతున్న కరోనా.. పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం రెడీ!

China ready to reopen schools

  • కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు
  • నిన్న కొత్తగా 9 మందికి కరోనా పాజిటివ్
  • స్థానికులు ఎవరూ లేరన్న ప్రభుత్వం

కరోనా పుట్టినిల్లు చైనా పూర్తిస్థాయిలో పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మూతబడిన పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. చైనాలో ప్రస్తుతం 288 మంది కరోనా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరో 361 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక, నిన్న దేశంలో కొత్తగా 9 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే, వీరంతా బయటి దేశాల నుంచి వచ్చిన వారేనని, స్థానికులు ఎవరూ లేరని ప్రభుత్వం పేర్కొంది.

కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఇటీవల ప్రభుత్వం బడులు తెరిచింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలతో తరగతులు నిర్వహిస్తోంది. అయితే, ఇంకా 25 శాతం మంది స్కూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. మరోవైపు, రాజధాని బీజింగ్‌లో అన్ని విద్యా సంస్థలకు చెందిన 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News