Pranab Mukherjee: కోమాలోనే ఉన్నప్పటికీ ప్రణబ్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందన్న ఆర్మీ వైద్యులు

Army doctors said Pranab Mukherjee health improves gradually
  • మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలైన ప్రణబ్
  • ఆపై కరోనా పాజిటివ్
  • ప్రస్తుతం లంగ్ ఇన్ఫెక్షన్ కు చికిత్స చేస్తున్నామన్న వైద్యులు
మెదడులో రక్తం గడ్డకట్టడంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా వైరస్ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు ఎంతో జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నారు. తాజాగా ప్రణబ్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఇంకా గాఢమైన కోమాలోనే ఉన్నారని, అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్మీ వైద్యులు తెలిపారు. పల్స్ రేటు, రక్త ప్రసరణలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవని, కీలక ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నాయని వివరించారు. పైగా కిడ్నీల పనితీరు కూడా కొద్దిమేర మెరుగైందని పేర్కొన్నారు. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని, కరోనా వైరస్ ప్రభావంతో ఏర్పడిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని ఆ బులెటిన్ లో వెల్లడించారు.
Pranab Mukherjee
Coma
Corona Virus
Army Hospital
New Delhi

More Telugu News