Allu Arjun: దర్శకుడు మారుతి ఆఫీసులో అల్లు అర్జున్ సందడి

Hero Allu Arjun visits director Maruthi office in Hyderabad
  • విరామంలో మారుతి ఆఫీసుకు వెళ్లిన బన్నీ
  • ఎంతో ఉల్లాసంగా గడిపిన వైనం
  • ఫొటోలను పంచుకున్న నిర్మాత ఎస్కేఎన్
కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ లు లేకపోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు బయట కనిపించడం తగ్గిపోయింది. ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్లు ఉంటే తప్ప ఎవరూ ఇల్లు వదలడం లేదు. తాజాగా అల్లు అర్జున్  దర్శకుడు మారుతి ఆఫీసును సందర్శించగా, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. మారుతి ఆఫీసులోనూ ఎంతో ఉల్లాసంగా గడిపిన బన్నీ, ఆఫీసు పరిసరాలను ఆస్వాదించారు. ఈ ఫొటోలను నిర్మాత ఎస్కేఎన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
Allu Arjun
Maruthi
Office
Hyderabad
Tollywood

More Telugu News