Somireddy Chandra Mohan Reddy: ప్రసాద్ శిరోముండనం ఎవరూ చూడలేదు.. కానీ వైజాగ్ లో శిరోముండనం చూస్తుంటే కడుపు మండుతోంది: సోమిరెడ్డి

Somireddy responds on attacks over dalits in state
  • ఏపీలో దళితులపై పెరిగిన దాడులు
  • ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం
  • తాజాగా వైజాగ్ లో మరో శిరోముండనం
ఏపీలో దళితులపై దాడులు జరుగుతుండడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న దుశ్చర్యలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా అనేది అర్థంకాని పరిస్థితి నెలకొందని, అధికారులు ఏంచేస్తున్నారో, ప్రభుత్వం ఏంచేస్తోందో, మంత్రిమండలి ఏంచేస్తోందో తెలియడంలేదని విమర్శించారు.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారని, ఇదేమీ చిన్న విషయం కాదని అన్నారు. ఓ పోలీస్ స్టేషన్ లోనే ఆ విధంగా జరిగిందని తెలిపారు. దీంట్లో రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ ఘటనకు కారకులపై చర్యలు ఏవి? అని ప్రశ్నించారు. ఆ శిరోముండనం ఎలా చేశారో ఎవరూ చూడలేదని, కానీ వైజాగ్ లో తాజాగా జరిగిన శిరోముండనం ఘటనను వీడియోలో చూస్తుంటే కడుపు మండిపోతోందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Somireddy Chandra Mohan Reddy
Attacks
Tonsures
Dalits
Andhra Pradesh

More Telugu News