Gutta Mohan Reddy: జేసీబీ డ్రైవర్, సైట్ ఇంజనీర్లను తుపాకితో బెదిరించిన మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి

Ex minister Gutta Mohan Reddy warns officials with Gun
  • పిల్లాయిపల్లి కాల్వ విస్తరణ పనులను అడ్డుకున్న మాజీ మంత్రి
  • తన పొలం నుంచి పనులు ఎలా చేపడతారంటూ వాగ్వివాదం
  • మోహన్‌రెడ్డి నుంచి తుపాకి, 25 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
జేసీబీ డ్రైవర్, సైట్ ఇంజనీర్లను తెలంగాణకు చెందిన మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకితో బెదిరించడం కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. మండలంలోని పెద్దకాపర్తి చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు పిల్లాయిపల్లి కాల్వ విస్తరణ పనులు జరుగుతున్నాయి.

అయితే, ఈ పనులు తన పొలం మీదుగా జరుగుతున్న విషయం తెలుసుకున్న మోహన్‌రెడ్డి వెంటనే అక్కడకు చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. జేసీబీ డ్రైవర్, సైట్ ఇంజినీర్లను తుపాకితో బెదిరించారు. వెంటనే పనులు ఆపాలని హుకుం జారీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చిట్యాల పోలీసులు మోహన్‌రెడ్డి నుంచి లైసెన్స్‌డ్ తుపాకి, 25 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Gutta Mohan Reddy
Nalgonda District
Gun
Engineer

More Telugu News