Srikanth: దళిత యువకుడికి శిరోముండనం చేస్తుండగా మహిళ వీడియో కాల్.. పోలీసుల ఆరా

woman in Nutan Naidu make video call to live srikanth head shaving
  • శిరోముండనాన్ని లైవ్‌లో ఎవరికో చూపించే ప్రయత్నం
  • ఆమె ఎవరికి కాల్ చేసిందన్న దానిపై పోలీసుల ఆరా
  • నూతన్ నాయుడి ఇంటి నుంచి శ్రీకాంత్ అరుపులు వినిపించాయన్న ఇరుగుపొరుగు
నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడిని కొడుతూ, శిరోముండనం చేయించిన ఘటనలో మరో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. నూతన్ నాయుడి ఇంటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో ఓ మహిళ ఎవరికో వీడియో కాల్ చేసి శిరోముండనాన్ని చూపించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె ఎవరికి కాల్ చేసింది? ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నూతన్ నాయుడి ఇంటికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. నూతన్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయని, శ్రీకాంత్‌కు గుండుకొట్టించి బయటకు తీసుకురావడాన్ని తాము చూశామని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు.
Srikanth
Nutan Naidu
Visakhapatnam District
CCTV
Video call

More Telugu News