Pranab Mukherjee: నిన్నటి నుంచి మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి

There is a decline in the medical condition of Pranab Mukherjee
  • బులెటిన్ విడుదల చేసిన ఆర్మీ ఆసుపత్రి
  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి ప్రణబ్‌కు చికిత్స
  • ప్రమాదకరస్థాయిలో తగ్గిపోయిన బీపీ
  • ఇప్పటికీ కోమాలోనే మాజీ రాష్ట్రపతి
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై వున్న విషయం తెలిసిందే. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ నిర్వహించారు. అదే సమయంలో, ఆయనకు కరోనా కూడా సోకింది. దీంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆసుపత్రిలో నిన్నటి నుంచి ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆసుపత్రి తాజా బులెటిన్‌లో తెలిపింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన బీపీ ప్రమాదకరస్థాయిలో తగ్గిపోయిందని వివరించింది. ప్రణబ్‌కు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపింది. ఆయన ఇప్పటికీ కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.
Pranab Mukherjee
Corona Virus
India

More Telugu News