Bandla Ganesh: ప్రయత్నిస్తున్నా.. మన దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి: బండ్ల గణేష్

Bandla Ganesh says that he is trying  to make a movie with Pawan Kalyan
  • మళ్లీ సినిమాలపై దృష్టి సారించిన పవన్  
  • పవన్ తో సినిమా ఎప్పుడంటూ బండ్లకు అభిమానుల ప్రశ్న
  • అదే పనిపై ఉన్నానన్న బండ్ల గణేశ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే సినీ నిర్మాత బండ్ల గణేశ్ కు ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్', 'తీన్ మార్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. మరోవైపు, జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం వపన్ కల్యాణ్ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. దీంతో, పవన్ తో సినిమా ఎప్పుడు తీస్తున్నారంటూ బండ్ల గణేశ్ ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ, తాను కూడా అదే పనిలో ఉన్నానని, మన దేవుడి ఆశీస్సులు కావాలని చెప్పారు. పవన్ ను బండ్ల గణేశ్ దేవుడిగా భావిస్తారనే విషయం తెలిసిందే.
Bandla Ganesh
Pawan Kalyan
Tollywood
Janasena

More Telugu News