Sensex: చైనాతో ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 839 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 260 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- అన్ని సూచీలకు నష్టాలే
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. వాస్తవాధీనరేఖ వద్ద చైనాతో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 839 పాయింట్లు కోల్పోయి 38,628కి పడిపోయింది. నిఫ్టీ 260 పాయింట్లు పతనమై 11,387కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఓఎన్జీసీ (1.74%), టీసీఎస్ (0.86%) కంపెనీలు మాత్రమే లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా (-7.34%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.65%), బజాజ్ ఫిన్ సర్వ్ (-5.34%), బజాజ్ ఫైనాన్స్ (-5.10%), ఎన్టీపీసీ (-5.07%)లు టాప్ లూజర్లుగా ఉన్నాయి.