Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ కు ఊరట... శిబిరంలో అందరికీ కరోనా నెగెటివ్

Corona negative for all in Chennai Super Kings franchise

  • ఇటీవల సూపర్ కింగ్స్ శిబిరంలో కరోనా కలకలం
  • ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్
  • తాజా పరీక్షల్లో అందరికీ నెగెటివ్
  • సెప్టెంబరు 5 నుంచి ప్రాక్టీస్!

ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే విషమ పరీక్ష ఎదురైంది. పలువురు ఆటగాళ్లు సహా సహాయక సిబ్బంది కూడా కరోనా బారినపడడంతో ఆ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఐపీఎల్ ప్రారంభం సమయానికి కుదుటపడుతుందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే వీటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోని ఆటగాళ్లకు, సిబ్బందికి అందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది.

తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో చెన్నై శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఇక టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మరోసారి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 5 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సాధన ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇటీవలే సురేశ్ రైనా యూఏఈ నుంచి అర్థాంతరంగా వచ్చేయడంతో అతడి స్థానం ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చెన్నై జట్టులో ధోనీ, బ్రావో తర్వాత రైనా కీలక ఆటగాడు అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News