Peddireddi Ramachandra Reddy: ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్

Peddireddi Ramachandra Reddy tests positive with Corona
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దిరెడ్డి
  • కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి కూడా కరోనా
  • ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, అచ్చెన్నాయుడు వంటి రాజకీయవేత్తలు దీని బారిన పడ్డారు. తాజాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో, ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. ఏపీలో ఇప్పటి వరకు 4,34,771 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,30,526 మంది కోలుకున్నారు. మొత్తం 3,969 మంది దీని బారిన పడి ప్రాణాలు వదిలారు.
Peddireddi Ramachandra Reddy
YSRCP
Corona Virus

More Telugu News