KCR: రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే: సీఎం కేసీఆర్
- కొత్త జీఎస్టీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు
- సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమన్న కేసీఆర్
- నిర్ణయం మార్చుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజా జీఎస్టీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.
కేంద్రం ప్రతిపాదనలు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమనీ, జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని విమర్శించారు. రుణాలపై ఆంక్షలు సహేతుకం కావని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావంతో ఆదాయం ఘోరంగా పడిపోయిందని, జీఎస్టీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టేనని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందని తెలిపారు.