Suriya: సురేశ్ రైనాకు హీరో సూర్య మద్దతు

Hero Suriya supports cricketer Suresh Raina
  • రైనా బంధువులపై దొంగల దాడి
  • ఇద్దరు మృతి
  • కిరాతకులను శిక్షించాలంటూ సూర్య ట్వీట్
క్రికెటర్ సురేశ్ రైనా మేనత్త కుటుంబంపై పంజాబ్ లో దోపిడీ దొంగలు దాడి చేయగా, ఆమె భర్త, కుమారుడు మృతి చెందడం తెలిసిందే. రైనా మేనత్త ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతోంది. తన బంధువుల కుటుంబంలో జరిగిన దారుణానికి రైనా సైతం చలించిపోయాడు. ఇది ఘోరమైన చర్య అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో రైనాకు తమిళ హీరో సూర్య మద్దతుగా నిలిచాడు. రైనా బంధువర్గంలో జరిగిన విషాదానికి సంతాపం తెలియజేస్తున్నానంటూ సూర్య ట్వీట్ చేశాడు. "ఈ కష్టకాలంలో మేమందరం నీ వెన్నంటే ఉంటాం. ఆ మనసులేని కిరాతకులను చట్టం ముందు నిలబెట్టాలి. సురేశ్ రైనా కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ సూర్య పేర్కొన్నాడు.
Suriya
Suresh Raina
Attack
Punjab

More Telugu News