Ravishankar Prasad: ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు లేఖ రాసిన కేంద్రమంత్రి

Union minister Ravishankar Prasad writes to Facebook CEO Mark Zuckerberg
  • ఫేస్ బుక్ లో ప్రధానిపై దుష్ప్రచారం జరుగుతోందని వెల్లడి
  • వ్యూహాత్మక దాడి జరుగుతోందంటూ ఆరోపణలు
  • చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్న రవిశంకర్ ప్రసాద్
ప్రధాని నరేంద్ర మోదీపైనా, ఇతర కేంద్రమంత్రులపైనా ఫేస్ బుక్ లో వ్యూహాత్మక దాడి జరుగుతోందని, ఫేస్ బుక్ ఉద్యోగులే అందుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు లేఖ రాశారు.

ప్రధాని, తదితరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల ఫేస్ బుక్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫేస్ బుక్ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందన్న దానిపై తమ వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. మోదీ తదితరులపై దుష్ప్రచారం చేస్తున్నవారిలో ఫేస్ బుక్ కీలక ఉద్యోగులు కూడా ఉన్నారని ఆరోపించారు.
Ravishankar Prasad
Mark Zuckerberg
Facebook
Narendra Modi
India

More Telugu News