Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం లేఔట్ కు ఆమోదం తెలిపిన ఏడీఏ.. మొత్తం లేఔట్ 2.74 లక్షల చ.మీటర్లు
- 12,879 చ.మీ విస్తీర్ణంలో ప్రధాన ఆలయం
- అన్ని శాఖల నుంచి ఎన్ఓసీలను తీసుకున్నామన్న అయోధ్య కమిషనర్
- పునాదుల తవ్వకాల నిర్ణయం అయోధ్య ట్రస్టుదే
అయోధ్య రామ మందిర నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. మందిరానికి సంబంధించిన లేఔట్ కు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ (ఏడీఏ) ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా ఏడీఏ కమిషనర్ ఎంపీ అగర్వాల్ మాట్లాడుతూ, మొత్తం లేఔట్ 2.74 లక్షల చదరపు మీటర్లు అని తెలిపారు. ఇందులో ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారని చెప్పారు. నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తీసుకున్నామని తెలిపారు. పునాదుల తవ్వకాలను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని అయోధ్య ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు.