Devineni Uma: అందుకే ప్రతి పంపుసెట్టుకు మీటర్ బిగింపు: దేవినేని ఉమ

devineni slams ycp

  • కరెంటును ప్రైవేటుపరం చేయడంలో భాగంగా చర్యలు
  • ఒక్కో డివిజన్ ఒక్కోప్రైవేటు సంస్థకు..
  • బిల్లుల వసూలు బాధ్యత వారిదే

రైతులకు ఉచిత విద్యుత్తు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

'ప్రతి పంపుసెట్టుకు మీటర్ బిగింపు, ఒక్కో డివిజన్ ఒక్కోప్రైవేటు సంస్థకు.. బిల్లుల వసూలు బాధ్యత వారిదే. ప్రైవేటుపరం అయితే కొత్త తలనొప్పులు, సబ్సిడీలు తగ్గించే అవకాశం ఉందంటున్న నిపుణులు.. కరెంటును ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే మీటర్ల బిగింపంటున్న రైతుల ఆందోళనకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఉన్న 18 లక్షల ఉచిత విద్యుత్‌ కనెక్షన్లతో పాటు మరో లక్ష అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించి వాటిని ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం కిందికి తీసుకురానున్నట్లు ఆ పత్రికల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News