Suresh Raina: పట్టువిడవని సీఎస్కే .. రైనాను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించిన వైనం!

CSK removes Suresh Raina from their Whatsapp group
  • ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వైదొలగిన రైనా
  • వ్యక్తిగత కారణాలే కారణమన్న క్రికెటర్  
  • అయినా రైనాపై చర్యలకు దిగుతున్న సీఎస్కే
సురేశ్ రైనా... మన దేశ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఎన్నో మ్యాచ్ లలో మన దేశం కోసం సర్వశక్తులను ఒడ్డిన బ్యాట్స్ మెన్. ఐపీఎల్ లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఎంతో శ్రమించాడు. అయితే, అది గతం.. ఇప్పుడు అతనికి, జట్టుకి మధ్య పొసగడం లేదు. ప్రస్తుత ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన రైనా... వ్యక్తిగత కారణాలను చూపి ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.  

అయితే, హోటల్ రూము విషయంలో గొడవపడి వచ్చేశాడంటూ మరోపక్క వార్తలొచ్చాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే సాక్షాత్తు సీఎస్కే అధినేత, బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, రైనాకు విజయగర్వం నెత్తికెక్కిందంటూ వ్యాఖ్యానించారు.

అయినా రైనా దీనిపై స్పందిస్తూ... ఆయన తన తండ్రిలాంటి వారని ఎంతో వినయంగా బదులిచ్చి, కాస్త మెట్టు దిగాడు. అయినా, సీఎస్కే యాజమాన్యం రైనా విషయంలో పట్టువిడవడం లేదు. సీఎస్కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనాను తొలగించింది. మరి, దీనిపై రైనా ఎలా స్పందిస్తాడో చూడాలి!
Suresh Raina
Team India
CSK
Whatsapp

More Telugu News