raghu rama krishnaraju: అశోక్‌గజపతిరాజు మచ్చలేని వ్యక్తి: రఘురామకృష్ణరాజు
- ఈ మధ్య జరుగుతోన్న పరిణామాలు సరిగ్గాలేవు
- అటువంటి వ్యక్తిని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తొలగించారు
- దురుద్దేశంతో కూడుకున్న పనే ఇది
- సింహాచలంలో దేవుడికి అన్యాయం జరుగుతుంది
సింహాచల దేవస్థానం భూముల విషయంపై వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మధ్య జరుగుతోన్న పరిణామాలు సరిగ్గాలేవని అన్నారు. ఫిబ్రవరిలో ఓ జీవో విడుదల చేశారని, అప్పట్లో అన్ని వ్యవహారాలు సరిగ్గానే ఉన్నాయని చెప్పారు.
అశోక్‌గజపతిరాజు మచ్చలేని వ్యక్తి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మచ్చలేని వ్యక్తి ఆయన ఒక్కరేనని చెప్పారు. అటువంటి వ్యక్తిని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తొలగించడం దురుద్దేశంతో కూడుకున్నదేనని విమర్శించారు. ఇంత సంకుచిత స్వభావం ముఖ్యమంత్రి జగన్ కు ఉంటుందని తాను అనుకోవట్లేదని చెప్పారు.
స్త్రీ, పురుషులు సమానమైనప్పటికీ పురుషుడిని తీసేసి, సంప్రదాయాన్ని కాదని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయితను తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అశోక్‌గజపతిరాజును తొలగించేందుకు సరైన కారణాలు ప్రభుత్వం చూపలేక పోయిందని ఆయన చెప్పారు వందల ఏళ్ల సంప్రదాయాన్ని కాలరాసి ఆనందగజపతిరాజు మొదటి భార్య రెండో కుమార్తెకు పదవి ఇచ్చారని చెప్పారు.
రాత్రికి రాత్రే సంచయితని ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా నియమించారని విమర్శించారు. అక్కడ ప్రైవేటు వ్యక్తులను నియమిస్తున్నారని అన్నారు. సింహాచలంలో దేవుడికి అన్యాయం జరుగుతుందని రఘురామకృష్ణరాజు విమర్శలు అన్నారు. వేల ఎకరాల సింహాచలం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపణలు గుప్పించారు.