Viral Videos: 'నాదీ నక్కిలీసు గొలుసు' అంటూ సిగ్గుప‌డుతూ బామ్మ పాట‌.. వీడియో వైర‌ల్

old woman video goes viral

  • 'పలాస' చిత్రంలోని 'నాదీ నక్కిలీసు గొలుసు' అనే పాట
  • ఎక్క‌డ చూసినా ఇదే పాట విన‌ప‌డుతున్న వైనం
  • పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రినోటా ఇదే

'పలాస' చిత్రంలోని 'నాదీ నక్కిలీసు గొలుసు' అనే పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ సాహిత్యానికి అందరూ ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసినా ఈ పాట‌ మారుమోగింది. టీవీల్లోనూ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ప్రోగ్రాముల్లోనూ ఇప్పటికీ ఇదే పాట వినప‌డుతుంటుంది. చాలా మంది సెల్ ఫోన్ రింగ్ టోన్ గా ఈ పాట‌ను వాడేస్తున్నారు.

ఉత్తరాంధ్ర యాస సాహిత్యానికి సినీ సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె అందించిన అద్భుతమైన ట్యూన్ బాగా అలరించింది. పిల్లల‌ నుంచి పండు ముదుసలి వ‌ర‌కు అంద‌రూ ఈ పాట‌ను పాడుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఈ వీడియో. ఓ బామ్మ 'నాదీ నక్కిలీసు గొలుసు' అనే పాట‌ను పాడుతుండ‌గా తీసిన ఓ వీడియోను ర‌ఘు కుంచె త‌న ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. బామ్మ అద్భుతంగా పాడింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.  
   

  • Loading...

More Telugu News