Sushant Singh Rajput: 'త‌దుప‌రి జాబితాలో నా కూతురు'.. సుశాంత్ ప్రియురాలు రియా తండ్రి ఆవేద‌న‌

rhea father about sushant case
  • మా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశారు
  • నా కుమారుడిని అరెస్టు చేశారు
  • భార‌త్ కి ధ‌న్య‌వాదాలు
బాలీవుడ్ ‌యువ‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్‌ మృతి కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న అధికారులకు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం గురించి తెలిసిన విష‌యం విదిత‌మే. డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై రెండు రోజుల క్రితం సుశాంత్ ప్రియురాలు రియా సోద‌రుడు షోవిక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. దీనిపై అతడి తండ్రి  ఇంద్రజిత్‌ చక్రవర్తి స్పందిస్తూ... తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశారని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  

భార‌త్ కి ధ‌న్య‌వాదాలు అని ఇంద్ర‌జిత్ అన్నారు. "నువ్వు నా కుమారుడిని అరెస్టు చేశావు. అనంత‌రం అరెస్ట‌య్యే వారి జాబితాలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ త‌ర్వాత ఇంకెవరో నాకు తెలియదు" అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థంగా పడగొట్టేశారని ఇంద్ర‌జిత్ అన్నారు. న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుందంటూ విమ‌ర్శిస్తూ ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో రియాను కూడా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో ఆమె చేసిన చాటింగ్ ఇప్ప‌టికే అధికారుల దృష్టికి వచ్చింది.
Sushant Singh Rajput
Bollywood
rhea

More Telugu News