Tamil Nadu: రాజకీయాల్లోకి రావాలంటూ నటుడు సూర్యపై ఒత్తిడి తెస్తున్న అభిమానులు

SURIYA trends on social media as fans celebrate the actors glorious film career
  • నటుడిగా 23 ఏళ్లు పూర్తిచేసుకున్న సూర్య
  • సినిమాలు విడిచిపెట్టి తమిళనాడును ఏలేందుకు రావాలని పిలుపు
  • వైరల్ అవుతున్న పోస్టర్లు
నటుడిగా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నతమిళ నటుడు సూర్యకు అభిమానుల నుంచి అనూహ్య ఆహ్వానం అందింది. ఇక సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల్లో రావాలని ఆహ్వానించారు. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య పలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు కోరుతున్నారు.

చిత్రసీమలో సూర్య అడుగుపెట్టి శనివారానికి 23 ఏళ్లు పూర్తయింది. దీనిని పురస్కరించుకుని వివిధ నగరాల్లోని ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ‘‘సినిమాను ఏలింది చాలు.. ఇక తమిళనాడును పాలించేందుకు రండి’’ అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లలో సూర్యను చేగువేరాలా ముద్రించడం విశేషం. ఆ పక్కనే తమిళనాడు సెక్రటేరియట్ కూడా ఉంది. దీంతో ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Tamil Nadu
Kollywood
Actor Suriya
social media
Politics

More Telugu News