Nara Lokesh: జగన్ గారికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- చంద్రబాబు పాలనలో అభివృద్ధి
- ఏపీకి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1
- ర్యాంకు ఇచ్చిన బుద్ధి లేని వాడు ఎవడు? అని జగన్ అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తే, జగన్ మరోలా ఆయన మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.
"వైఎస్ జగన్ గారికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. చంద్రబాబు నాయుడి గారి పాలనలో ఏపీకి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానం వచ్చింది. ఆ ర్యాంకు ఇచ్చిన బుద్ధి, జ్ఞానం లేని వాడు ఎవడు? అని నోరుపారేసుకున్నారు జగన్" అని లోకేశ్ అన్నారు.
"ఇప్పుడు అదే నోటితో వైకాపా పాలనలో వచ్చిన ర్యాంకింగ్ కాకపోయినా తన పనితనం చూసే ఏపీకి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ఇచ్చారని, తాటికాయంత అక్షరాలతో సొంత మీడియా లో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి వచ్చింది" అని చెప్పారు.
"చంద్రబాబు గారి హయాంలో ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం రాలేదు అన్న జగన్ తోనే టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయి. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని నిజం చెప్పించాడు ఆ దేవుడు అని లోకేశ్ ట్వీట్లు చేశారు.