Manchu Lakshmi: రియాను ఉక్కిరిబిక్కిరి చేసిన మీడియా... ఓ మహిళతో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మంచు లక్ష్మి ఆగ్రహం

Manchu Lakshmi reacts on Rhea Chakraborty situation at NCB Office
  • ఎన్సీబీ విచారణకు హాజరైన రియా
  • మీడియా ప్రతినిధుల మధ్యలో చిక్కుకుపోయిన రియా
  • నీచాతినీచం అంటూ మంచు లక్ష్మి ట్వీట్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరయ్యారు. అయితే ఎన్సీబీ అధికారుల ముందు దర్యాప్తుకు హాజరయ్యేందుకు వచ్చిన రియాను మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం ముందుకు కదిలేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, చాలామంది రియా పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి కూడా తీవ్రంగా స్పందించారు. "ఇది అత్యంత నీచాతినీచం కంటే ఎక్కువ. ఓ మహిళతో వ్యవహరించాల్సిన విధానం ఇది ఎంతమాత్రం కాదు. మరొకరి పట్ల ఇంత భయంకరంగా ఎలా ఉండగలరు? ఓ మనిషి పట్ల ఎలాంటి హుందాతనం చూపకుండా దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

Manchu Lakshmi
Rhea Chakraborty
Media
NCB
Sushant Singh Rajput

More Telugu News