Birmingham: బ్రిటన్ లో కలకలం.. బర్మింగ్ హామ్ సిటీలో వరుస కత్తిపోట్ల ఘటన

Serial stabbings raises concerns in Birmingham

  • ఒకరు మృతి
  • ఏడుగురికి గాయాలు
  • ఇద్దరి పరిస్థితి విషమం
  • దుండగుడి కోసం ముమ్మర గాలింపు

బ్రిటన్ లోని పెద్ద నగరాల్లో ఒకటైన బర్మింగ్ హామ్ లో వరుస కత్తిపోట్లు తీవ్ర కలకలం రేపాయి. పలు చోట్ల కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది.. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం సిటీ సెంటర్ సమీపంలోని రోడ్లను మూసివేసి దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటనను తీవ్రమైనదిగా పేర్కొన్న పోలీసులు, దాడికి గల కారణాలను ఇంకా గుర్తించలేదు. ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్న ఓ దుండగుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News