ICMR: లక్షణాలు లేని వారి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి!
- ఆధారాలు లభ్యమైతే మాస్కుల వాడకంపై సరికొత్త సూచనలు
- ఐసీఎంఆర్‌ను ఉటంకిస్తూ ఐజేఎంఆర్‌లో సంపాదకీయం
- రెండోసారి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ
కరోనా వైరస్ ఇప్పటి వరకు లక్షణాలు ఉన్న వారి ద్వారానే వ్యాపిస్తుందని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని, లక్షణాలు లేనివారి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ దీనికి ఆధారాలు కనుక లభ్యమైతే నిరంతరం మాస్కుల వాడకాన్ని, ఇతర ప్రజారోగ్య చర్యల్ని సూచించాల్సి ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)ని ఉటంకిస్తూ ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) సంపాదకీయం పేర్కొంది. నిజానికి కరోనా ఉద్ధృతంగా ఉన్న తొలినాళ్లలో అది రెండోసారి సోకే అవకాశాలు లేవని భావించేవారమని, కానీ తాజా అధ్యయనాల్లో మాత్రం మహమ్మారి మళ్లీ సోకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సంపాదకీయంలో వివరించింది.