Gutta Jwala: అర్ధరాత్రి ఉంగరం తెచ్చిన గుత్తా జ్వాల మేనేజర్... తమిళ హీరోతో నిరాడంబరంగా నిశ్చితార్థం

Badminton star Gutta Jwala engagement with Tamil hero Vishnu Vishal
  • విష్ణువిశాల్ తో జీవితం పంచుకోనున్న గుత్తా జ్వాల
  • కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ
  • నేడు జ్వాల పుట్టినరోజు
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొంతకాలంగా తమిళ హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఎంతో నిరాడంబరంగా తమ నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇవాళ జ్వాల పుట్టినరోజు. ఈ సందర్భంగానే ఉంగరాలు మార్చుకున్నట్టు తెలిసింది.

దీనిపై విష్ణు విశాల్ సోషల్ మీడియాలో స్పందించాడు. "ఇది  జీవితాలకు నూతన ఆరంభం. ఇలాగే సానుకూల దృక్పథంతో కొనసాగుదాం. బసంత్ జైన్ (గుత్తా జ్వాల మేనేజర్) అర్ధరాత్రి వేళలోనూ మాకోసం ఉంగరం తీసుకువచ్చాడు. ఆయనకు ధన్యవాదాలు. మాకు మీ అందరి దీవెనలు కావాలి" అంటూ విష్ణువిశాల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
Gutta Jwala
Vishnu Vishal
Engagement
Wedding

More Telugu News