Jawahar: కేటీఆర్‌ ను ఉదాహరిస్తూ.. జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ నేత జవహర్

Jagan has to recognise the efforts of Chandrababu says Jawahar
  • ఈజీ మనీకి అలవాటు పడిన మనిషి జగన్
  • చంద్రబాబు వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి ర్యాంకు వచ్చింది
  • చంద్రబాబు కృషిని కేటీఆర్ గుర్తించారు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి స్థానం దక్కడం గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని... అయితే అది ఎవరి వల్ల వచ్చిందో మాత్రం చెప్పరని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. జగన్ ఈజీ మనీకి అలవాటు పడిన మనిషని, అలాంటి వ్యక్తికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎలా తెలుస్తుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి స్థానం రావడానికి చంద్రబాబే కారణమని తెలిపారు.

జగన్ దెబ్బకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి కూడా భయపడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు హీరో, లులూ, కియా, అదాని వంటి పరిశ్రమలను ఎలా బెదిరించారో చూశామని అన్నారు. పెట్టుబడిదారుల సదస్సులు పెట్టకుండానే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కృషిని తెలంగాణ మంత్రి కేటీఆర్ గుర్తించారని.. అదే విధంగా జగన్ కూడా గుర్తిస్తే మంచిదని అన్నారు. సూర్య, చంద్రులు కూడా తన వల్లే వస్తున్నారని భవిష్యత్తులో జగన్ చెప్పుకున్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. జగన్ కు పరభాషపై ఉన్న మోజు సొంత భాషపై లేదని అన్నారు.
Jawahar
Telugudesam
Chandrababu
KTR
TRS
Jagan
YSRCP

More Telugu News