Krishnapatnam Port: అదానీ గ్రూప్ చేతికి కృష్ణపట్నం పోర్టు... ఉత్తర్వులు జారీ
- కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటా అదానీ గ్రూప్ పరం
- రూ.13,572 కోట్లు చెల్లించిన అదానీ గ్రూప్
- నాట్కో జినోమిక్ సంస్థకు 25 శాతం వాటా కొనసాగింపు
రాష్ట్రంలోని అతిపెద్ద ప్రైవేటు పోర్టు అయిన కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూప్ పరమైంది. నవయుగ సంస్థకు చెందిన 75 శాతం వాటాలను అదానీ గ్రూప్ కు బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాట్కో జినోమిక్ ప్రైవేటు లిమిటెడ్ కు 25 శాతం వాటా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను అదానీ గ్రూపు రూ.13,572 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ మొత్తంలోనే కృష్ణపట్నం పోర్టుకు చెందిన రూ.6 వేల కోట్ల అప్పు కూడా ఉంది. ఈ రుణాన్ని అదానీ గ్రూప్ చెల్లించనుంది. మిగతా మొత్తాన్ని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (కేపీసీఎల్) సంస్థకు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.