Russia: ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయడాన్ని ప్రారంభించిన రష్యా!

Russia Started Vaccine to Normal People

  • వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన గమేలియా, ఆర్డీఐఎఫ్
  • పౌర అవసరాల నిమిత్తం వ్యాక్సిన్ విడుదల
  • ప్రకటించిన రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • రాజధాని వాసులందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్న మాస్కో మేయర్

కరోనా వైరస్ ను పారద్రోలేందుకు రష్యాకు చెందిన గమేలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ, (ఆర్డీఐఎఫ్) రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తొలి బ్యాచ్ ని విడుదల చేసిన ప్రభుత్వం, దాన్ని ప్రజలకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. పౌర అవసరాల నిమిత్తం వ్యాక్సిన్ ను విడుదల చేశామని, ప్రాంతాల వారీగా వీటిని పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

"కరోనా సోకకుండా అడ్డుకునే తొలి బ్యాచ్ గామ్-కోవిడ్ వాక్ (స్పుత్నిక్ వీ) అన్ని ల్యాబొరేటరీ క్వాలిటీ టెస్ట్ లను అధిగమించి, రోస్ డ్రావన్ డ్జోర్ (మెడికల్ డివైస్ నియంత్రణా మండలి) అనుమతులతో పౌర సమాజానికి అందుబాటులోకి వచ్చింది" అని రష్యా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ప్రపంచంలోనే కరోనా సోకకుండా తొలి వ్యాక్సిన్ ను తయారు చేసింది తామేనని గత నెల 11న ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా పలువురు సైంటిస్టులు అనుమానాలను వ్యక్తం చేసినా, రష్యా మాత్రం ఎవరి విమర్శలనూ పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. సమీప భవిష్యత్తులోనే రష్యా రాజధాని మాస్కో నగరవాసులందరికీ వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News