Amit Shah: జయప్రకాశ్ రెడ్డి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: కేంద్ర మంత్రి అమిత్ షా

Amit Shah convey his condolences to the demise of Jayaprakash Reddy
  • ఈ ఉదయం గుండెపోటుతో జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం
  • గొప్ప ప్రతిభ గల నటుడు అంటూ అమిత్ షా ట్వీట్
  • ఆయన స్థానం భర్తీ చేయలేనిది అంటూ వ్యాఖ్యలు
సినీ, రంగస్థల నట దిగ్గజం జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి గారి అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం అని కీర్తించారు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. జయప్రకాశ్ రెడ్డి స్థానం భర్తీ చేయలేనిదని, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నట్టు వివరించారు.
Amit Shah
Jayaprakash Reddy
Sudden Death
Condolences
Tollywood

More Telugu News