Adimulapu Suresh: లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

Chandrababu making false allegations says Adimulapu Suresh
  • అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు 
  • ఒకే ప్రాంతంలో లక్ష కోట్లను ఖర్చు చేయడంలో అర్థం లేదు
  • ఉచిత విద్యుత్ కు వైయస్ఆర్ ఆద్యుడు
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్ అభిమతమని... దానికి తామంతా కట్టుబడి ఉంటామని మంత్రి ఆదిమూలపు సురేశ్ సురేశ్ చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అని అన్నారు. లక్ష కోట్ల రూపాయలను ఒకే ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. పాత పథకాల పేర్లనే మారుస్తూ ప్రచారం చేసుకుంటున్నారంటూ టీడీపీ అధినేత విమర్శిస్తున్నారని... వైయస్సార్ సంపూర్ణ పోషణ గత మెనూకి, ఇప్పటి మెనూకి మధ్య ఉన్న తేడాను గమనించాలని చెప్పారు. ఉచిత విద్యుత్తుకు వైయస్ రాజశేఖరరెడ్డి ఆద్యుడని... రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
Adimulapu Suresh
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News