Whatsapp: వాట్సాప్ ను క్రాష్ చేస్తున్న ప్రమాదకర టెక్ట్స్ సందేశాలు!

Text messages from unknown numbers will be dangerous to for Whatsapp
  • వాట్సాప్ నెట్వర్క్ పై కన్నేసిన బ్రెజిల్ హ్యాకర్లు
  • టెక్ట్స్ మెసేజ్ ఓపెన్ చేస్తే వాట్సాప్ క్రాష్
  • ఒక్కోసారి ఫోన్ క్రాష్ అయ్యే ప్రమాదం
వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తాజాగా ఆసక్తికర వివరాలు వెల్లడించింది. అనుమానాస్పద టెక్ట్స్ సందేశాలతో వాట్సాప్ కు కలిగే ముప్పును వాబీటా ఇన్ఫో వివరించింది. బ్రెజిల్ హ్యాకర్లు వాట్సాప్ నెట్వర్క్ పై దాడులకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. కీబోర్డులో ఉండే అర్థంపర్థంలేని స్పెషల్ క్యారక్టర్లను ఓ మెసేజ్ రూపంలో పంపుతారని, ఆ మెసేజ్ ను ఓపెన్ చేస్తే వాట్సాప్ క్రాష్ అవుతుందని, అయినప్పటికీ వాట్సాప్ ను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తే ఈసారి ఫోన్ క్రాష్ అవుతుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

కొత్త నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలను యూజర్లు తెరవకపోవడమే మంచిదని పేర్కొంది. ఈ టెక్ట్స్ సందేశాల ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వాట్సాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవడమే పరిష్కారమని స్పష్టం చేసింది.
Whatsapp
Text Messages
Crash
Phone
WaBetaInfo
Brazil
Hacking

More Telugu News