Nara Lokesh: వాళ్లే ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు: లోకేశ్
- ఏపీలో పలు దేవాలయాల్లో ఘటనలు
- ప్రాంతాల వారీగా చిచ్చు రాజేస్తున్నారంటూ లోకేశ్ వ్యాఖ్యలు
- రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్
ఏపీలో ఇటీవల దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్న వాళ్లే ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల వెనుక ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరో బయటపడాలి, వరుస ఘటనలకు కారణమైన వారు ఎంత పెద్దవాళ్లైనా శిక్షించాలని స్పష్టం చేశారు.
కొవిడ్ కేంద్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నా ఎవరూ గమనించకపోవడం దారుణం: లోకేశ్
నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ కేంద్రంలో పరమేశ్వరమ్మ అనే కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడంపైనా లోకేశ్ స్పందించారు. బాధితురాలు కొవిడ్ కేంద్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నా ఎవరూ గమనించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జేసీని, నోడల్ అధికారిని అకస్మాత్తుగా బదిలీ చేశారని, దాని పర్యవసానమే పేషెంట్లపై పర్యవేక్షణ కొరవడిందని తెలిపారు. కరోనా ఆసుపత్రుల్లో బాధితుల దయనీయ పరిస్థితికి ఇది నిదర్శనం అంటూ లోకేశ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.