Vijay Sai Reddy: కుతంత్రాలను ఉపేక్షించేది లేదు!: రథం దగ్ధంపై విజయసాయిరెడ్డి
- వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటున్నారా?
- చట్టం తన పని తాను చేసుకుపోతుంది
- దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు
- కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం ఇటీవల అగ్నికి ఆహుతైన ఘటనపై ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. జనసేన, బీజేపీ 'ఛలో అంతర్వేది'కి కూడా పిలుపునిచ్చాయి. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
"రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు చేసింది జగన్ గారి సర్కార్. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది" అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.