Sujana Chowdary: సోము వీర్రాజు గృహనిర్బంధంపై ఎంపీ సుజనా స్పందన

MP Sujana Chowdary responds on AP BJP Chief Somu Veerraju house arrest
  • అంతర్వేది రథం దగ్ధం ఘటనపై బీజేపీ ఆగ్రహం
  • ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ చీఫ్
  • బీజేపీ కార్యకర్తల అరెస్ట్ ను, సోము గృహనిర్బంధాన్ని ఖండించిన సుజనా
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం కావడంపై ఏపీ బీజేపీ నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ట్విట్టర్ లో స్పందించారు. అంతర్వేది నరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై ఆందోళనకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని గృహనిర్బంధం చేసి, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనలో దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుజనా డిమాండ్ చేశారు.
Sujana Chowdary
Somu Veerraju
House Arrest
Antarvedi
Chariot Burning
BJP
Andhra Pradesh

More Telugu News