Rafale Jets: భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన రాఫెల్స్.. వీడియోలు ఇవిగో
- కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్
- ‘సర్వ ధర్మ పూజ’ నిర్వహణ
- రాఫెల్ విన్యాసాల వీక్షణ
ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థకు భారత్ ఆర్డర్ ఇచ్చిన 36 రాఫెల్ విమానాల్లో ఐదు ఇటీవల దేశానికి చేరిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా హర్యానాలోని అంబాల వైమానిక స్థావరంలో ఉన్న ఈ విమానాలు ఈ రోజు భారత వైమానిక దళంలో చేరాయి.
అంబాల ఎయిర్ బేస్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తో పాటు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్లీ, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సర్వ ధర్మ పూజ’ నిర్వహించిన అనంతరం ఈ యుద్ధ విమానాల విన్యాసాలను రాజ్ నాథ్ వీక్షించారు.
భారత వాయుసేన అమ్ములపొదిలో రాఫెల్స్ చేరడం ఇండియా-ఫ్రాన్స్ మధ్య ఉన్న బలమైన బంధానికి చిహ్నమని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత వైమానిక దళం మరింత శక్తిమంతం అవుతుందని చెప్పారు.
కాగా, భారత్-పాక్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాల వైమానిక స్థావరం ఉంటుంది. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు భారత వాయుదళ శక్తిని మరింత పెంచనున్నాయి. ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకోగలవు.