Walmart: డ్రోన్ల ద్వారా సరుకుల డెలివరీ.. పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన వాల్ మార్ట్

Walmart started households delivery with drones

  • కీలక అడుగువేసిన వాల్ మార్ట్ 
  • పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన వాల్ మార్ట్
  • ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉంటుందని వ్యాఖ్య 

ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక అడుగు వేసింది. ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరుకులను ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టింది.

డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు నిన్నటి నుంచి సరుకులు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా వాల్ మార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. రానున్న రోజుల్లో మిలియన్ల ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయడాన్ని చూస్తామని చెప్పింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News