Rhea Chakraborthy: సెషన్స్ కోర్టులో రియాచక్రవర్తి బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

Bail plea of RheaChakraborthy and others rejected
  • రిమాండ్ లో ఉన్న రియా
  • డ్ర‌గ్స్ కేసులో ఆరోప‌ణ‌లు
  • ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిష‌న్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో విచార‌ణ జ‌రుపుతోన్న సంబంధింత అధికారులు ఆయ‌న ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌ప‌డ‌డంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఆమెను అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలపై 14 రోజుల జుడీషియల్ రిమాండ్ కు తరలించింది.

ఈ నేప‌థ్యంలో ముంబైలోని సెషన్స్ కోర్టులో ఆమె దాఖ‌లు చేసిన‌ బెయిల్ పిటిష‌న్ ను ఈ రోజు న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. కాగా, ముంబైలోని బైకుల్లా జైలులో వున్న రియా బెయిలు పిటిషన్ ను ఇప్పటికే మేజిస్ట్రేట్‌ తిరస్కరించడంతో, సెషన్స్ కోర్టులో ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అది కూడా తాజాగా తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ఇదే కేసులో రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు మ‌రికొందరి బెయిల్ పిటిష‌న్లు కూడా తిరస్క‌ర‌ణ‌కు గురి కావ‌డం గ‌మ‌నార్హం.
Rhea Chakraborthy
Sushant Singh Rajput
Bollywood
CBI

More Telugu News