Sensex: చైనాతో ఉద్రిక్తతలు... ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- 14 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 15 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2 శాతానికి పైగా పుంజుకున్న ఎస్బీఐ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855కి చేరుకుంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఇండియా (2.30), టీసీఎస్ (1.81), టెక్ మహీంద్రా (1.76), హిందుస్థాన్ యూనిలీవర్ (1.16), బజాజ్ ఫైనాన్స్ (1.03).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.71), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.52), ఏసియన్ పెయింట్స్ (1.34), భారతి ఎయిర్ టెల్ (1.19), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.11).