Swami Agnivesh: ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ఇక లేరు!

Swami Agnivesh is no more

  • ఢిల్లీలోని ఐఎల్ బీఎస్ లో కన్నుమూత
  • కాలేయ వ్యాధితో బాధపడుతున్న స్వామి అగ్నివేశ్
  • నాలుగు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స

ఆర్యసమాజ్ నేత, జాతీయస్థాయి సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా ఆయన ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్ బీఎస్)లో చికిత్స పొందుతున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న స్వామి అగ్నివేశ్ కు వైద్యులు నాలుగు రోజుల కిందట వెంటిలేటర్ అమర్చారు. అయితే ఈ సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో వైద్యుల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అందరినీ విషాదానికి గురిచేస్తూ స్వామి అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు.

స్వామి అగ్నివేశ్ వయసు 80 సంవత్సరాలు. ఆయన 1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు వేప శ్యాంరావు. ఆయన కోల్ కతాలో విద్యాభ్యాసం చేశారు. లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన స్వామి అగ్నివేశ్ 1977లో హర్యానాలో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నాడు ఉమ్మడి ఏపీలో మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో అగ్నివేశ్ ప్రముఖ పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News