IYR Krishna Rao: ప్రభుత్వాలు మారినా భూకబ్జాలు మారేటట్లు లేవు: ఐవైఆర్ కృష్ణారావు
- గొడవర్తి పద్మావతి భూమి విషయంపై స్పందన
- ఈ భూమిని టీడీపీ వ్యక్తులు కబ్జా చేశారు
- వాళ్లు ఈ రోజు వైసీపీ మనుషులు అయిపోయినట్లు ఉంది
టీడీపీ, వైసీపీ తీరుపై ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు కురిపించారు. "గొడవర్తి పద్మావతి గారి భూమి విషయం తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ప్రచారంలోకి రావడం నేను కూడా ఆ అంశాన్ని పరిశీలించిన తర్వాత దీనిని గురించి వైఎస్ జగన్ గారు నిర్వహించిన విశాఖ సభలో ప్రస్తావించడం జరిగింది. ఆ రోజుల్లో షేక్ సలీం గారు ఆమె తరఫున నిలబడి నన్ను చాలాసార్లు కలిశారు.
ఈ భూమిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తులుగా కబ్జా చేసిన వాళ్లు ఈ రోజు వైసీపీ మనుషులు అయిపోయినట్లు ఉంది. ప్రభుత్వాలు మారినా భూకబ్జాలు మారేటట్లు లేవు. ఆ రోజు ఆ పార్టీ వ్యక్తులు ఈరోజు ఈ పార్టీ వాళ్ళు అయ్యేటట్లు ఉన్నారు" అని పేర్కొన్నారు.