Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
- రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం
- రేపు, ఎల్లుండి తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు
- నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీమ్, సిద్ధిపేట, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.