YSRCP: ఆనాడు గోపాలస్వామి రథం దగ్ధమైతే అప్పటి టీడీపీ సర్కారు ఏం చేసింది?: వైసీపీ

YCP questions TDP over Pentapadu Gopalaswamy chariot burning issue

  • అంతర్వేది ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య యుద్ధం
  • 2017 రథం దగ్ధం ఘటనను ప్రస్తావించిన వైసీపీ
  • ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయలేదంటూ ట్వీట్

అంతర్వేది రథం దగ్ధం ఘటన అధికార వైసీపీ, టీడీపీ మధ్య మరింత అగ్గి రాజేసింది. తనపై విపక్ష టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండం పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో టీడీపీ పాలనలో ఓ రథం దగ్ధమైతే ఏంచేశారంటూ ప్రశ్నించింది. టీడీపీ పాలనలో 2017 అక్టోబరు 19న సాయంత్రం 5 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా కె.పెంటపాడు గ్రామంలో ఉన్న శ్రీ గోపాలస్వామి ఆలయంలో రథం దగ్ధమైందని వైసీపీ వెల్లడించింది.

ఆ ఘటన జరిగిన రోజున సీసీ కెమెరాలు పనిచేయలేదని, ఘటనపై సీబీఐ విచారణ కోరలేదని, ఈవోని సస్పెండ్ చేయలేదని, కొత్త రథానికి ఒక్క రూపాయి కేటాయించలేదని వైసీపీ ట్విట్టర్ లో ఆరోపించింది. దీనికి సంబంధించి వీడియో కూడా పంచుకుంది.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చారిత్రక రథం అగ్నికి ఆహుతైంది. దీనిపై విపక్షాలతో పాటు హిందూ సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. అటు, ఈ ఘటనపై నిగ్గు తేల్చేందుకు సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News