KCR: యాదాద్రి గుట్టపై కోతులకు అరటికాయలు అందించిన సీఎం కేసీఆర్

 CM KCR distributes Bananas to monkeys at Yadadri shrine
  • యాదాద్రిలో సీఎం పర్యటన
  • లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు
  • కోతులను చూసి కాన్వాయ్ ఆపించిన కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పుణ్యక్షేత్రంలో పర్యటించారు. రోడ్డుమార్గం ద్వారా కొండపైకి చేరుకున్న సీఎం అక్కడి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు అక్కడి ఆర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కేసీఆర్ పూజల అనంతరం వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పనులను స్వయంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కాగా, తిరుగుప్రయాణంలో సీఎం కేసీఆర్ గుట్టపై ఉన్న కోతులను చూసి వాహనం ఆపించారు. సెక్యూరిటీ సిబ్బంది తెచ్చిన అరటికాయలను ఆ కోతులకు అందించారు. కోతులు పెద్ద సంఖ్యలో ఉన్నా విసుక్కోకుండా ఎంతో ఓపిగ్గా వాటికి ఆహారం అందించి సంతృప్తి చెందారు.

KCR
Monkeys
Bananas
Yadadri
Telangana

More Telugu News