YV Subba Reddy: చినజీయర్ స్వామిని స్వయంగా కలిసి పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subbareddy met Chinajeeyar Swamy
  • చినజీయర్ స్వామికి మాతృవియోగం
  • తుదిశ్వాస విడిచిన అలివేలు మంగతాయారు
  • సంతాపం తెలియజేసిన వైవీ సుబ్బారెడ్డి
ప్రముఖ ఆధ్మాత్మికవేత్త చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు హైదరాబాదు శివార్లలోని ఆశ్రమంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో మాతృవియోగానికి గురైన చినజీయర్ స్వామిని ఏపీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.

ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం జగన్ ఫోన్ ద్వారా ఆయను పరామర్శించారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చినజీయర్ ను కలిశారు. ఆయనకు తన సంతాపం తెలియజేశారు. చినజీయర్ తల్లి అలివేలు మంగతాయారు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, చినజీయర్ ను కలిసిన సమయంలో వైవీ వెంట మైహోమ్ రామేశ్వర్ రావు కూడా ఉన్నారు.
YV Subba Reddy
Chinajeeyar Swamy
Mother
Demise
Condolences

More Telugu News